నిర్మాతగా దూకుడు చూపిస్తున్న అనుష్క

SMTV Desk 2018-03-31 18:57:29  Anushka Sharma, Clean State Films, Karnesh Sharma.

ముంబై, మార్చి 31 : బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా ఉన్న అనుష్క శర్మ నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. ఆమె తన తమ్ముడు కర్ణేష్ శర్మతో కలిసి క్లీన్ స్టేట్ ఫిలిమ్స్ అనే పేరుతో సొంత ప్రొడక్షన్ బ్యానర్ నిర్మించింది. ఇప్పటి వరకు అనుష్క వేరే నిర్మాణ సంస్థలతో చేతులు కలిపి మూడు సినిమాలు నిర్మించింది. అందులో ఒక సినిమా పరాజయం కాగా.. రెండు సినిమాలు పరవాలేదనిపించాయి. తాజాగా మరో మూడు సినిమాలను నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది. అంతగా లాభాలు లేకపోయినా నిర్మాతగా అనుష్క చూపించే దూకుడుకి.. సాటిలైట్ రైట్స్ రూపంలో వస్తున్న లాభాల కోసమే తీస్తుందని విమర్శకులు అంటున్నారు. ఏది ఏమైనా.. అనుష్క నిర్మాణ సంస్థ ఎన్ని లాభాలు తెచ్చిపెడుతుందో చూడాలి.