నాపై బెదిరింపులు ఆపండి : శ్రీరెడ్డి

SMTV Desk 2018-03-31 15:49:44  actress srireddy, srireddy facebook post.

హైదరాబాద్, మార్చి 31 : టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్ పై నటి శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఏ తెలుగు టీవీ ఛానల్ చూసిన ఎక్కువగా కాస్టింగ్ కౌచ్ అనే పదం వినబడుతుంది. సినిమాలో అవకాశాలు రావాలంటే తలొగ్గాల్సిందేనని నటి శ్రీరెడ్డి విమర్శలు చేస్తూ వస్తుంది. తాజాగా శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ లో ఆసక్తికర పోస్ట్ పెట్టింది. "ఇది నా మరణ వాంగ్మూలంతో సమాన౦.. "మా"లో మెంబర్‌షిప్ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు. మానసికంగా బాగా కుంగిపోయాను. ఇప్పటికైనా సినీ పరిశ్రమలోని పెద్దలు అర్థం చేసుకోవాలని కోరుతున్నా. ఇంతకన్నా చంపేయాలనుకుంటే చంపేయండి.. జీవితంపై ఎలాంటి ఆసక్తి లేదు. చంపినా.. బతికినా ఇక్కడే ఉంటా. బెదిరింపులు ఆప౦డి" అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. శ్రీరెడ్డి ఈ విధంగా పోస్ట్ పెట్టడం సంచలనాలకు దారి తీస్తోంది. ఇంతకీ ఆమెను ఎవరు బెదిరిస్తున్నారనే విషయం మిస్టరీగా మారింది.