సీబీఎస్‌ఈ పేపర్‌ లీక్‌పై ఆందోళన

SMTV Desk 2018-03-31 14:43:53  cbse, question, paper, leeke, News delhi

న్యూఢిల్లీ, మార్చి 31: సీబీఎస్‌ఈ ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనపై శనివారం ఢిల్లీలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. పలు రహదారులను దిగ్బంధం చేసి తమ నిరసన తెలియజేశారు. ప్రీత్‌ విహార్‌లో వాహనాలను విద్యార్థులు అడ్డుకున్నారు. కాంగ్రెస్‌ యువజన నేతలు.. ఆందోళన చేస్తున్న విద్యార్థులకు అండగా నిలిచారు. పది వాట్సాప్‌ గ్రూపుల్లో ప్రశ్నాపత్రాలు ‌లీకయ్యాయని.. ఇప్పటి వరకూ 60 మందిని విచారించినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రశ్నాపత్రం బహిర్గతం కావటంతో రద్దయిన సీబీఎస్‌ఈ 12వ తరగతి ఆర్థిక శాస్త్రం పరీక్షను ఏప్రిల్‌ 25న నిర్వహించనున్నట్లు నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. పదో తరగతి ప్రశ్నాపత్రం ఢిల్ల్లీ-ఎన్‌సీఆర్‌, హరియాణా ప్రాంతాల్లో మాత్రం బహిర్గతం అయ్యిందని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పరీక్షను ఎప్పుడు నిర్వహించేది 15రోజుల్లో తెలియజేస్తామని పేర్కొన్నారు.