మరోసారి "తెలుగు" లో వివేక్ ఒబెరాయ్

SMTV Desk 2018-03-31 13:47:13  Vivek Oberoi, vivek new film, ram charan, kaira adwani, boyapaati sreenu.

హైదరాబాద్, మార్చి 31 : దర్శకడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన "రక్తచరిత్ర" సినిమా గుర్తుందా.? ఆ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్.. మరోసారి తెలుగు ప్రజల మనసు గెలిచే ప్రయత్నంలో ఉన్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రంలో వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ ను ప్రారంభించారు. అయితే, ఈ సినిమా షూటింగ్ బృందం ఒబెరాయ్ ఆసక్తిని చూసి ముచ్చటపడిపోతోంది. ఎందుకంటే.. వివేక్ తెలుగు నేర్చుకునేందుకు ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు. షూటింగ్ స్పాట్ లో అందరు తనతో తెలుగులోనే మాట్లాడాలని కోరడం విశేషం. తన పాత్రకు న్యాయం చేయాలని తెలుగు భాషపై పట్టు సాధించేందుకు కృషి చేస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మాతగా రూపొందుతోన్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కైరా అద్వాని కథానాయికగా నటించనుంది.