బంగారంపై జీఎస్టీ మోత

SMTV Desk 2017-07-01 13:09:30  gst Effect, gold, In Telugu states,

హైదరాబాద్, జూలై 1 : నేటి నుంచి వస్తు-సేవ పన్ను అమలు కావటంతో దీని ప్రభావం బంగారం పై పడానుందా.. అని తెలుగు రాష్ట్రాలు ఆలోచనలో పడ్డాయి. ప్రస్తుతం ఆషాడం... ఆ తర్వాత శ్రావణ వరలక్ష్మి వత్రం రానుండటంతో బంగారు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి సమయంలోనే జీఎస్టీ ప్రభావం బంగారం పై పడుతుందని ముందుగానే తెలుసుకున్న ప్రజలు, జీఎస్టీ అమలు ప్రారంభంకు ఒక రోజు ముందు శుక్రవారం రోజున బంగారం దుకాణాలకు క్యూ కట్టారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో బంగారు ఆభరణాల దుకాణాలు కిటకిటలాడాయి. బంగారంపై 3 శాతం జీఎస్టీ .. ఆభరణాల తయారీపై 5 శాతం జీఎస్టీ విధించారు. ఫలితంగా కొనుగోలుపై పన్నుల భారం పడుతుంది. శుక్రవారం వరకు రూ.1800 పన్ను కట్టేవారు. ఇకపై రూ.2000 కట్టాల్సి ఉంటుంది. దీంతో బంగారం కొనుగోళ్లపై ఈ ప్రభావం పడుతుందని బంగారం షాపుల యాజమాన్యులు అభిప్రాయం వ్యక్తం చేసారు.