చరణ్ ఐటంసాంగ్ లో తమన్నా.?

SMTV Desk 2018-03-31 12:40:28  special song tamanna, ram charan, director boyapati sreenu.

హైదరాబాద్, మార్చి 31 : సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన "రంగస్థలం" సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. ఈ చిత్రంలో జిగేలు రాణిగా పూజాహెగ్డే ఐటం సాంగ్‌లో మెరసిన సంగతి తెలిసిందే. తాజాగా చరణ్ తన తదుపరి సినిమాను బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ ను ప్రారంభించారు. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఓ స్పెషల్ సాంగ్‌ను ప్లాన్ చేశారట చిత్రబృందం. ఈ మసాలా ఐటం సాంగ్‌లో తమన్నా.. రామ్ చరణ్ సరసన ఆడిపాడనున్నట్లు సమాచారం. ఇది వరకే తమన్నా "స్పీడున్నోడు", "అల్లుడు శీను", "జై లవకుశ" సినిమాలో ఐటంసాంగ్స్ చేసింది. డీవీవీ దానయ్య నిర్మాతగా రూపొందుతోన్న ఈ సినిమాలో కైరా అద్వాని కథానాయికగా నటించనుంది. బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ ఈ చిత్రంలో విలన్‌గా నటించనున్నారు.