ఆ భారీ సినిమా అందుకే వదులుకున్నా : నితిన్

SMTV Desk 2018-03-30 11:52:35  nithin, kamal haasan, vikram movie, director rajesh selva.

హైదరాబాద్, మార్చి 30 : రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ లో విలక్షణ నటుడు కమల్ హాసన్ భారీ బడ్జెట్ తో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రాజేశ్ సెల్వ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా విభిన్నమైన కథాకథనాలతో తెరకెక్కించనున్న ఈ చిత్రంలో ప్రముఖ కథానాయకుడు నితిన్ నటించే అవకాశం ఉందంటూ గత కొన్ని రోజులుగా ఒక వార్త షికారు చేసింది. ఈ విషయంపై స్పందించిన నితిన్ తనకు ఆ సినిమా ఆఫర్ వచ్చిన మాట వాస్తవమేనని వెల్లడించారు. ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ.. "విక్రమ్ తో సమాన ప్రాధాన్యత కలిగిన పాత్రకోసం నన్ను అడిగారు. 45 రోజుల పాటు అమెరికాలో షూటింగ్ జరుగుతుందన్నారు. కాని నేను అప్పటికే "శ్రీనివాస కళ్యాణం", "దాగుడుమూతలు" ఒప్పుకున్నాను. విక్రమ్ లాంటి స్టార్ హీరోతో కలిసి నటించే అవకాశాన్ని వదులుకున్నందుకు బాధగానే ఉంది" అంటూ చెప్పుకొచ్చాడు.