పెళ్లిలో చోటు చేసుకున్న ఘటన...

SMTV Desk 2017-06-30 18:49:08  Prayer eat and 45 people sick, Nalanda district in Bihar, Chhote Chauhan, Wedding, dayHospital,

బీహార్, జూన్ 30 : ప్రసాదం తిని 45 మంది అస్వస్థతకు గురైన ఘటన బీహార్‌లోని నలంద జిల్లాలో చోటు చేసుకుంది. లాల్ బాగ్ గ్రామంలో ఛోటే చౌహాన్ అనే వ్యక్తి తన పెళ్లి రోజు సందర్భంగా ఇంట్లో సత్యనారాయణ స్వామి పూజ చేయించుకున్నారు. పూజ చేసిన తర్వాత అందరికి ప్రసాదం పంచడం మొదలు పెట్టారు. అప్పటికే ప్రసాదం తిన్న కొందరు అస్వస్థతకు గురైనారు. ఆ ప్రసాదం తిన్న మరుక్షణం అందరూ వాంతులు చేసుకోవటంతో వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. కడుపునొప్పితో బాధపడుతున్న బాధితులను వైద్యులు చికిత్స చేశారు. బాధితుల్లో ఎక్కువగా 30 మంది చిన్నారు ఉండటంతో అందరు తీవ్ర ఆందోళన చెందారు. ప్రసాదం తిన్నవారిని వెంటనే ఆస్పత్రికి తీసుకురావడంతో ప్రాణాపాయం నుంచి సురక్షితంగా కాపాడగలిగామని వారికి ఇప్పుడు అలాంటి ఆపాయం లేదని చికిత్సనందించిన వైద్యుడు తెలిపారు.