ఆధార్, పాన్ కార్డులు చెల్లుతాయి...!!

SMTV Desk 2017-06-30 18:35:41  aadhar cord, pan cord, gst, bil, govt

ఢిల్లీ, జూన్ 30 : జూలై 1 నుండి ప్రారంభం కాబోతున్న జీఎస్టీ గురించి ఎలాంటి భయాలు అవసరం లేదు. ఆధార్ తో అనుసంధానం కాని పాన్ కార్డులు అన్ని రద్దు కావు, అని శుక్రవారం ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది. పాన్ కార్డు తో ఆధార్ లింక్ తప్పనిసరి చేస్తూ కేంద్రప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారి చేసిన సంగతి తెలిసిందే. ఆధార్ తో పాన్ కార్డు అనుసంధానానికి ఈరోజే చివరి తేది అని ప్రకటించడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. దీంతో ఆధార్ అనుసంధానానికి ఇన్కంటాక్స్ వెబ్ సైట్లను ఆశ్రయిస్తూ ఉండడంతో ఆ సైట్ సర్వర్ ఫై భారం పడిఅన్ని కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఈ నేపద్యం లో "ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జూన్ 30 తర్వాత ఆధార్ తో అనుసంధానం కాని పాన్ కార్డు లు రద్దు కావు' అని ప్రకటించింది. జూలై 1, 2017 నుంచి పాన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తి ఆధార్ నెంబర్ ను సెక్షన్ 139 ఏఏ లోని సబ్ సెక్షన్ (2) ప్రకారం తప్పనిసరిగా అనుసంధానం చేసి డీజీఐటీ (సిస్టమ్స్) కి తెలియజేయాల్సి ఉంటుందని తెలిపింది. ఈ చట్టంలోని 114 వ నిబందనల్లో పలు సవరణలు చేసినట్లు పేర్కొంది.