గుండ్రంపల్లి త్యాగాలను దేశం మరచిపోదు

SMTV Desk 2017-05-29 11:56:44  amithsha,goundrampalli,nalgonda district,

నల్గొండ, మే 28 : గుండ్రంపల్లి తెలంగాణ ఉద్యమ పోరాటాన్ని వెలుగులోకి తెచ్చి, జాతీయ స్థాయిలో ఆ పోరాటానికి ప్రత్యేక ప్రాధాన్యతను తీసుకురావడమే తన పర్యటన ప్రధానాంశం అని బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా ప్రకటించారు. గుండ్రంపల్లి చారిత్రక గ్రామం, ఛాయాచిత్ర ప్రదర్శనలో తల్లులు, చెల్లెలు, అక్కలపై రజాకార్ల అకృత్యాలు చూసి ఆవేదన చెందానని, రజాకార్లకు వ్యతిరేకంగా తిరగ బడిన 160 మందిని హత్యచేశారని, త్యాగాలు చేసిన ఈ మహానీయుల గడ్డను దేశం మరచిపోదని స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లిని ఆయన సందర్శించిన సందర్భంగా ఆ మేరకు వివరించారు. కార్యవిస్తారక్ యోజనలో భాగంగా తెలంగాణాలోని ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటన కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిజాం సర్కారుకు వ్యతిరేకంగా స్వాతంత్ర్యం కోసమై పోరాడి జైలు జీవితం గడిపిన ఆరుగురిని, మరో సమరయోధుడి వారసుడిని ఘనంగా సత్కరించారు.