వైద్యుడా..... మాంత్రికుడా.....

SMTV Desk 2017-06-30 18:05:08  indian, doctor, peshant

న్యూఢిల్లీ, జూన్ 30 : బుధవారం రాజస్థాన్ లోని బార్మర్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. చికిత్స చెయ్యవలసిన వైద్యుడే కొడితే చికిత్స కోసం ఎవరి దగ్గరకు వెళ్ళాలి. ప్రస్తుతం ఈ విషయానికి సంభందించిన ఒక వీడియో సోషల్ నెట్ వర్క్స్ లో రచ్చరచ్చ చేస్తుంది. సొండి గ్రామానికి చెందిన ఒక మహిళ సృహ కోల్పోవడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె కుటుంబ సభ్యులు చెప్పింది ఏమిటంటే ఎవరో తన జుట్టు పట్టుకుని వెనక్కి లాగారని చెప్పింది అని అన్నారు. అప్పుడు వైద్యుడు నేను చూసుకుంటాను అని చెప్పి ఆయన వాళ్ళను అక్కడి నుండి పంపి దెయ్యాలను వదిలించే మాంత్రికుడిలా ప్రవర్తించారు. ఆమెను జుట్టు పట్టుకుని పళ్ళు రాలే విధంగా కొట్టాడు. ఆ తరువాత ఆమెను డిశ్చార్జ్ చేసారు. ఇది అంతా అక్కడి కెమెరా లో రికార్డు అవ్వడం వలన అతని గుట్టు బయట పడింది. ఈ వీడియో కి సంబంధించి ఎన్నో విషయాలు బయటికి రావడంతో ఆరోగ్యశాఖ మంత్రి చరణ్ సరాఫ్ కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టి ఆ వైద్యుడిని ఆసుపత్రి నుండి తొలిగించమని హెచ్చరిక జారిచేసారు.