బంపర్ ఆఫర్ కొట్టిన శ్రీరెడ్డి..

SMTV Desk 2018-03-28 15:35:32  actress srireddy, director teja, teja new fil project.

హైదరాబాద్, మార్చి 28 : నటి శ్రీరెడ్డి.. ఇండస్ట్రీలోని పలువురు పెద్దలు సినిమా అవకాశాల పేరుతో నటీమణుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని, వారిని శారీరకంగా లొంగదీసుకుంటున్నారని ఆరోపిస్తూ.. వస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో అగ్ర కథానాయికలు ఇలియానా, రాధికా ఆప్టే, మాధవీలత వంటి వారు ఇండస్ట్రీలోని "కాస్టింగ్ కౌచ్" పై బాహాటంగానే ప్రకటిస్తూ వస్తున్నారు. తాజాగా శ్రీరెడ్డి.. తన అభిప్రాయాన్ని వెలిబుచ్చుతూ ఇండస్ట్రీలోని ప్రముఖుల వ్యవహారాలను ఎలాగైనా బయటపెడతానని హెచ్చరించింది. తెలుగు అమ్మాయిలకు సినీ ఇండస్ట్రీలో అవకాశాలు ఇవ్వరంటూ విరుచుకుపడింది. ఈ నేపథ్యంలో వెతుకున్న తీగ కాలికి తగిలినట్లు ఆమెకు బంపర్ ఆఫర్ తగిలింది. ప్రముఖ డైరెక్టర్ తేజ.. శ్రీరెడ్డికి రెండు సినిమాల్లో అవకాశం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో మొత్తానికి శ్రీరెడ్డి అనుకున్నది సాధించింది అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. కాగా తేజ ప్రస్తుతం బాలకృష్ణ, వెంకటేష్‌ల సినిమాలతో బిజీగా ఉన్నారు.