వేడిగాలుల హోరు.. ఐపీఎల్ జోరు..

SMTV Desk 2018-03-28 11:18:53  ipl-11, chennai super king, mumbai indians, summer season

హైదరాబాద్, మార్చి 28 : వేసవి కాలం వచ్చేసింది.. యువతకు పరీక్షల సమయం ఇంచుమించుగా అయిపోయనట్లే.. ఇక ఈ వేడిగాలుల హోరుకు బౌండరీల జోరుకు రంగం సిద్దమవుతుంది. ఓ వైపు మండే ఎండ మరో వైపు ఉరకలేత్తించే ఐపీఎల్ టోర్నీ. గత దశాబ్దకాలంగా అలరిస్తున్న ఈ మెగా టోర్నీకి ఇంకా 10 రోజుల్లో తెరలేవనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాకారులను ఒకటి చేస్తూ ప్రారంభం కాబోతున్న ఐపీఎల్-11 సీజన్ కోసం అభిమానులు ఎంతోగానో ఎదురుచూస్తున్నారు. ఎంత తిన్నా ఆవకాయ మీదా మమకారం పోదు.. అలాగే ఎంత చూసిన ఐపీఎల్ బోరు కొట్టదు. సాయంత్రం అయితే చాలు అందరూ టీవీలకు అతుక్కుపోతారు. ఎన్ని కుంభకోణాలు జరిగిన, అవాంతరాలు ఏర్పడిన ఈ లీగ్ కు ఉన్న ఆదరణ మాత్రం చెక్కుచెదరడం లేదు. ఇప్పటికే టోర్నీ నిర్వాహకులు ఆరంభవేడుకలు ఘనంగా జరిపేందుకు ప్రయత్నాలు మొదలపెట్టారు. ఏడు వారాలు పాటు జరిగే ఈ యుద్ధం కోసం అన్ని జట్లు సాధనను ముమ్మరం చేశాయి. టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్ ముంబయిలోని వాంఖడే స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది.