"నేల టిక్కెట్టు" @ 25 కోట్లు..

SMTV Desk 2018-03-27 16:59:59  nelaticket satellite rights, raviteja, nela ticket movie,

హైదరాబాద్, మార్చి 27 : మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం "నేల టిక్కెట్టు". కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా శాటిలైట్, డిజిటల్, హిందీ డబ్బింగ్ రైట్స్ కి గట్టిపోటీ ఏర్పడినట్లు తెలుస్తోంది. దీంతో ఓ టీవీ ఛానల్ వారు ముందుకు వచ్చి ఈ సినిమా శాటిలైట్.. డిజిటల్.. హిందీ అనువాద హక్కులను సొంతం చేసుకుందట. ఇందుకు గాను ఆ ఛానల్ 25 కోట్లు చెల్లించినట్టు తెలుస్తోంది. కుటుంబ కథనంతో తెరకెక్కిన ఈ చిత్రంలో పలు మాస్ అంశాలను జోడించినట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను మే 24వ తేదీన విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.