‘అనర్హత’పై హైకోర్టులో విచారణ..వాయిదా

SMTV Desk 2018-03-27 13:31:23  high court, Congress, Petition membership

హైదరాబాద్, మార్చి 27: శాసనసభా సభ్యత్వం కోల్పోయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌ల కేసును హైకోర్టు న్యాయమూర్తి వాయిదా వేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌పై హెడ్‌ఫోన్ విసిరిన సంఘటనపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌ల శాసనసభా సభ్యత్వం రద్దు అయిన సంగతి తెలిసిందే. దీనిపై వారిద్దరూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరగాల్సి ఉండగా ప్రభుత్వం తరపున న్యాయవాదులెవరూ హాజరుకాకపోవడంతో హైకోర్టు న్యాయమూర్తి కేసును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.