ఎన్టీఆర్ బయోపిక్ కు రంగం సిద్దం..!

SMTV Desk 2018-03-27 12:56:15  ntr biopic, balakrishna, ntr movie, director teja.

హైదరాబాద్, మార్చి 27 : ఎన్టీఆర్ బయోపిక్ పై రోజురోజుకి ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. తేజ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు బాలకృష్ణ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి "ఎన్టీఆర్" అనే టైటిల్ ను ఖరారు చేశారు. సాయి కొర్రపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని హైదరాబాద్ - రామకృష్ణ స్టూడియోస్ లో ఈ నెల 29వ తేదీన ఆరంభించనున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఎన్టీఆర్.. ఒక నటుడిగా అగ్రస్థానానికి చేరుకోవడం మొదలుకొని ఆయన రాజకీయ రంగప్రవేశం, ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం వరకూ ఈ కథ కొనసాగనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి సాంకేతిక నిపుణుల వివరాలను చిత్రబృందం వెల్లడించనుంది.