నమ్మకాన్ని నిలబెట్టేందుకు చాలా కష్టపడ్డా : రామ్ చరణ్

SMTV Desk 2018-03-26 14:27:24  RANGASTHALAM, RAM CHARAN, DIRECTOR SUKUMAAR.

హైదరాబాద్, మార్చి 26 : రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రంగస్థలం. ఈ సినిమా కోసం చరణ్ ఎంత కష్టపడ్డాడో ఒక్కసారి ఆ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. మరి అలాంటి చిత్రం గురించి రామ్ చరణ్ ఏమంటున్నాడంటే.. ఒక సాధారణ కథను ఎంతో అందంగా చూపించాలన్నది దర్శకుడు సుకుమార్ తపన. ఇందుకోసం గోదావరి ప్రాంతానికి వెళ్లి అక్కడి ప్రజల వాస్తవాలను అతి దగ్గర నుండి చూశాం. రంగస్థలం నాకు చాలానే కొత్త విషయాలను నేర్పడమే కాకుండా ఆర్థికంగా వెనుకబడిన వారి జీవితాలపై గౌరవం మరింతగా పెంచిందట. ఈ సినిమాకు ముందు తాను ఓ గ్రామంలో ఎప్పుడూ ఇంతకాలం ఉండలేదని.. కనీసం ఎప్పడూ లుంగీ కట్టుకోలేదని అంటున్నాడు. అయినా ఈ సినిమా నేను చేయగలను అని సుకుమార్ ఎలా భావించాడో.. ఆ నమ్మకాన్ని నిలబెట్టేందుకు నేను అంతే కష్టపడ్డా అంటున్నాడు చెర్రి.