వాట్స్ ప్ లో మరో ఆప్షన్

SMTV Desk 2017-06-30 15:05:10  wats app, social media, Video streaming, Text, Imoji,

న్యూఢిల్లీ, జూన్30 : ఈ మధ్య కాలంలో చిరుసందేశాలను పంపడంలో ఈ మెయిల్, ఫేస్ బుక్ లకంటే ఎక్కువగా వాట్స్ ప్ దే హావ నడుస్తుంది. చిరు సందేశాలు మొదలు వీడియో స్ట్రీమింగ్‌ వరకు శరవేగంతో దూసుకెలుతూ, సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్న వాట్సాప్, మరో సరికొత్త ఆప్షన్ ను జోడించింది. ఇతరులకు టెక్స్ట్ సందేశాలు పంపుతున్నప్పుడు ఈమోజీలను ఇంకా సులభంగా వెతికేలా కొత్తరకమైన సెర్చ్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం బీటా వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఆప్షన్‌తో.. ఇకపై ఈమోజీల కోసం అదే పనిగా స్క్రోలింగ్ చేస్తూ వెతుక్కోవాల్సిన పనిలేదు. ఉదాహరణకు సెర్చ్ ఆప్షన్‌లోకి వెళ్లి ‘హ్యాండ్’ అని టైప్ చేస్తే... చేతి గుర్తు రెడీగా కనిపిస్తుందన్నమాట. దీంతో క్షణాల్లో సందేశాలను అందంగా పంపుకోవచ్చు. బీటా వెర్షన్‌ 2.17.246లో ఈమోజీ సెర్చ్‌ ఆప్షన్ ఇప్పటికే యాక్టివేట్‌ అవ్వటంతో పాటు ... మిగతా వెర్షన్లలో కూడా త్వరలోనే దీన్ని విడుదల చేయనున్నట్లు ఈ కంపెనీ వెల్లడించింది. మరోవైపు ఇంతకుముందే ఆండ్రాయిడ్‌ వెర్షన్‌లో అందుబాటులోకి వచ్చిన వీడియో స్ట్రీమింగ్ ఆప్షన్... తాజాగా ఐఫోన్లలో కూడా అడుగుపెట్టింది. ఈ విధమైన సెర్చ్ ఆప్షన్ అందరికి త్వరలో అందుబాటులోకి రానుంది.