మహిళల, చిన్నారుల భద్రత వాటి చర్చలు

SMTV Desk 2017-06-30 14:41:41  telangana, minister, nayini narasimhareddy,

హైదరాబాద్, జూన్ 30: మహిళలను గౌరవిచడం మన దేశ సంస్కృతి. దీనిని ఆధారంగా తీసుకుని బేగంపేట పర్యాటక భవన్ లో భరోసా, మహిళల గౌరవం, చిన్నారుల భద్రత అనే అంశాల పై గురువారం ఇండియన్ పోలీసు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి డిజీపీ అనురాగ్ శర్మ, సీపీ మహేందర్ రెడ్డి, షీ టీమ్స్ ఇంఛార్జ్ స్వాతి లక్రా లు హాజరయ్యారు. ఈ సదస్సులో నాయిని నర్సింహారెడ్డి ముఖ్యంగా మహిళల గౌరవం కోసం మాట్లాడారు. నేటి సమాజంలో స్త్రీలకు రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేసారు. అదేవిధంగా చిన్నారుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. షీ టీమ్స్ దీని కోసం తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని, భద్రతలో మరింత నైపుణ్యం కనబరిచే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. మహిళలపై జరిగే లైంగికదాడుల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, స్త్రీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నాయిని నర్సింహారెడ్డి అన్నారు. మన దేశంలో ఎంతో మంది స్త్రీలపై, అందులో చిన్న, పెద్ద తేడా లేకుండా అత్యాచారాలు జరుగుతున్నాయని, వాటిని నిర్మూలించడమే ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు.