సిగ్నల్స్ లోపం.. ఢిల్లీ మెట్రో సేవలకు అంతరాయం

SMTV Desk 2017-06-30 14:30:27  metro, rail, dilli, india

న్యూఢిల్లీ, జూన్ 30: సిగ్నల్స్ లో సాంకేతిక లోపం కారణంగా డిల్లీలోని మెట్రో రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. ఇవాళ ఉదయం సిగ్నల్స్ లోపం తలెత్తడంతో ఫరిదాబాద్-కాశ్మీర్ గేట్ మార్గం నుండి వెళ్తున్నరైళ్ళు అన్నింటికీ, కంట్రోల్ యూనిట్ కు మద్య సంబందాలు తెగిపోయాయి. సెంటైలజుడ్ కంట్రోలింగ్ సిస్టం ఫెయిల్ అవడంతో కంట్రోల్ సిబ్బంది ఆయా స్టేషన్లను అప్రమత్తం చేసిందని డీఎంఆర్ సీ అధికారి వెల్లడించారు. ఆయా మార్గాల వెంబడి ప్రయాణికుల సాయంతో ఎక్కడికక్కడ రైళ్ళను నిలిపివేసినట్లు తెలిపారు. ఉదయం 8 గంటల నుండి 9 గంటలవరకు ఈ సమస్య ఉందని, ఆ తర్వాత రైలు సర్వీసుల మార్గాలను క్లియర్ చేసామని వెల్లడించారు.