మాజీ శాసన సభ్యుడికి కటకటాలు

SMTV Desk 2017-05-29 11:53:46  chengal venkatrao,conviction,murder case,

విశాఖపట్నం, మే 28 : హత్యకేసులో నిందితుడైన మాజీ శాసన సభ్యులు చెంగల వెంకట్రావు, మరో 20 మందికి యావజ్జీవ కారాగార శిక్ష ఖరారయ్యింది. ఈ సంచలన తీర్పును అనకాపల్లి పదో అదనపు జిల్లా జడ్జి బి.బి నాగేంద్రరావు వెలువరించారు. విశాఖ జిల్లా నక్కపల్లి మండలం బంగారమ్మ పేట గ్రామ సముద్రతీర ప్రాంతంలో సముద్రం ఇసుక నుండి ఖనిజాలు వెలికి తీసే కంపెనీని 2007లో స్థాపించారు. అయితే కంపేనీ ఏర్పాటును గ్రామస్థులు కొందరు వ్యతిరేకించగా మరికొందరు స్వాగతించారు. ఇదిలా ఉండగా ఆ సమయంలో స్థానిక శాసన సభ్యులుగా ప్రాతినిద్యం వహిస్తున్న చెంగల వెంకట్రావు బంగారమ్మ పేటలో ప్రతికూల, అనుకూల వర్గాల మధ్య సమన్వయం నెలకొల్పేందుకు ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసగా మారింది. వ్యతిరేక, అనుకూల వర్గాలుగా విడిపోయి ఘర్షణకు పాల్పడ్డారు. ఘర్షణలో బంగారమ్మపేటకు చెందిన గోసాల కొండ(55)మృతి చెందాడు. దాంతో పాటు ఆయన మద్దతుదారులు 9 మందికి గాయాలయ్యాయి. ఈ విషయమై పిర్యాదు చేయడంతో శాసన సభ్యులు చెంగల్ వెంకట్రావుతో పాటు మెుత్తం 24 మందిపై కేసు నమోదయింది. ఫ్యాక్షన్ సినిమాలతో కొత్త ఒరవడి సృష్టించిన చెంగల్ వెంకట్రావు నందమూరి బాలక్రిష్ణ నటించిన సమరసింహారెడ్డి నిర్మాణంతో సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత పాయికారావు పేట శాసన సభ్యులుగా ఎన్నికయ్యారు. రెండు సార్లు శాసన సభ్యులుగా ఆయన ప్రాతినిద్యం వహించారు.