అమరావతిలో "హ్యాపీ సిటీస్" సదస్సు..

SMTV Desk 2018-03-25 15:19:42  Happy Cities Summit 2018, amaravathi international summit, Hackathon Held for Beautification of Capital

అమరావతి, మార్చి 25 : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి 12 వ తేదీ వరకు "హ్యాపీ సిటీస్" పేరిట అంతర్జాతీయ సదస్సును నిర్వహించనున్నారు. అమరావతిని ఆనంద నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. వివిధ దేశ రాజధానులు, బహిరంగ ప్రాంతాలకు సంబంధించిన ఆకృతులపై సీఆర్డీఏ సూచనలు, సలహాలను స్వీకరించనున్నట్లు తెలిపారు. ఇందు నిమిత్తం "హ్యాపీ సిటీస్‌ హాకథాన్‌" పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.