రంగమ్మత్త గురోపదేశం..

SMTV Desk 2018-03-25 12:21:11  anchor anasuya, rangammatta character, anasuya twitter, rangasthalam movie,

హైదరాబాద్, మార్చి 25 : ఈ మధ్య కాలంలో యాంకర్ అనసూయ పలు చిత్రాలలో నటిస్తూ అభిమానుల నుండి మంచి ఆదరణను సంపాదించింది. ఆ మధ్య వచ్చిన "సోగ్గాడే చిన్ని నాయనా" చిత్రంలో హీరో నాగార్జునకు మరదలిగా నటించి మంచి మార్కులే కొట్టేసింది. తాజాగా అనసూయ "రంగస్థలం" సినిమాలో రంగమ్మత్త పాత్రను పోషిస్తున్నారు. ఇటీవల ఆ పాత్రకు సంబంధించి ఒక ఫోటోను తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఆ ఫోటోలో అనసూయ ఒక చేతిలో బుక్ పట్టుకొని.. దర్శకుడు సుకుమార్ కు హితబోధ చేస్తున్నట్లు ఉంది. ఆ ఫోటోతో పాటు "గురువు గారికి రంగమ్మత్త గురోపదేశం" అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.