"రంగస్థలం"లో అక్కినేని నాగచైతన్య..?

SMTV Desk 2018-03-25 11:48:48  rangasthalam movie, savyasachi teaser, ramcharan, Naga Chaitanya.

హైదరాబాద్, మార్చి 25 : టాలీవుడ్‌లో ఒకరి సినిమాకు మరో హీరోలు ప్రమోషన్స్ చేస్తుండడం సహజం. ఒకరికొకరు పోటీ పడుతూనే ఇలా తమ వంతు సాయం చేస్తూ స్నేహపూర్వకంగా ఉంటారు. తన సినిమా కాకపోయినా.. అక్కినేని యువ హీరో కోసం.. మెగా హీరో తన వంతు కృషి చేశాడు. ఇంతకి విషయమేమిటంటే.. రామ్‌చరణ్ "రంగస్థలం" సినిమా మార్చి 30 న విడుదలవుతు౦ది. అదే సమయానికి అక్కినేని నాగచైతన్య హీరోగా చందూమొండేటి దర్శకత్వంలో "సవ్యసాచి" సినిమా కూడా రానుంది. ఈ సినిమా టీజర్ మార్చి 27 న ఆన్‌లైన్‌లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో "సవ్యసాచి" సినిమా ప్రమోషన్స్ లో భాగంగా "రంగస్థలం" సినిమా విడుదలైన అన్ని థియేటర్స్ లో "సవ్యసాచి" టీజర్ ప్రదర్శించనున్నారని సమాచారం. అంటే ఒకే తెరపై ఇద్దరు హీరోలు సందడి చేయనున్నారన్నమాట. అదే జరిగితే ఇక అభిమానులకు పండగే.