నాకు 5 ఎకరాల భూమి ఉంది.. పెళ్లి చేసుకుంటావా.?

SMTV Desk 2018-03-25 11:11:04  heroine raai lakshmi, raai lakshmi twitter, fans marriage proposal.

హైదరాబాద్, మార్చి 25 : చాలా మంది తమకు నచ్చిన హీరోలను, హీరోయిన్ లను ఎంతో ఆరాధిస్తుంటారు. కొందరైతే తమ అభిమాన తారలకు ఏకంగా గుడి కట్టేస్తుంటారు. కాని ఇక్కడ ఓ అభిమాని ఏకంగా హీరోయిన్ రాయ్ లక్ష్మీని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. అంతేకాదు.. అనుకున్నదే తడవుగా ఆమెకు ట్విట్టర్ వేదికగా పెళ్లి చేసుకుంటావా.? అని అడిగేశాడు. అందుకు లక్ష్మీ స్పందించింది. ఇంతకీ ఎలా ప్రపోస్ చేశాడో తెలుసా.! * "నన్ను పెళ్లి చేసుకుంటావా.? నాకు 5 ఎకరాల భూమి ఉంది. అందమైన తోటలో ఒక ఇల్లు ఉంది. ఒక స్కూటర్ తో పాటు మీపై చెప్పలేనంత ప్రేమ ఉంది. దయచేసి నాకు సమాధానం ఇవ్వు" అంటూ ఓ అభిమాని రాయ్ లక్ష్మీని అడిగాడు. అందుకు లక్ష్మీ కూడా ఒక చక్కని సమాధానం ఇచ్చింది. * "నవ్వుతూ.. నీ ప్రపోజల్‌కి థ్యాంక్స్.. కానీ నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. ఒక అందమైన అమ్మాయి నీ జీవితంలోకి వస్తుంది" అంటూ తెలిపింది. దానికి ఆ అభిమాని.. "థాంక్స్ వెరీ మచ్ లక్ష్మీ.. నేను నీకు ప్రపోస్ చేయడానికి కారణం మా అమ్మ పేరు కూడా లక్ష్మీనే" అంటూ మరో ట్వీట్ చేశాడు.