"2 స్టేట్స్" తో తెరంగేట్రం చేయనున్న శివాని..

SMTV Desk 2018-03-24 14:58:39  2 states movie, 2 states movie shooting, hero adivi sesh, hero rajasekar daughter, heroine shivani.

హైదరాబాద్, మార్చి 24 : సినీ పరిశ్రమలో వారసులు, వారసురాళ్లు ఎంతో మంది వస్తుంటారు. అలా వచ్చిన వారిలో చాలా తక్కువ మంది సినీరంగంలో తమ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. తాజాగా ఇదే బాటలో హీరో రాజశేఖర్ కుమార్తె శివాని అరంగేట్రం చేయనుంది. అడవి శేషు కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో శివాని కథానాయికగా చేయనుంది. హిందీలో సూపర్ హిట్ అయిన "2 స్టేట్స్" చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి దర్శకుడు రాఘవేంద్రరావు, రాజమౌళి, ప్రముఖ నటుడు కృష్ణంరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తొలి సన్నివేశానికి రాజమౌళి క్లాప్ కొట్టగా.. దర్శకుడు రాఘవేంద్రరావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. లక్ష్య ప్రొడక్షన్ బ్యానర్ లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంతో వెంకట్ కుంచ నూతన దర్శకుడిగా పరిచయమవుతున్నారు.