ఈ తారక్ ఫేక్..!

SMTV Desk 2018-03-24 11:37:32  ntr gym photo, ntr, trivikram srinivas, tollywood

హైదరాబాద్, మార్చి 24 : టాలీవుడ్ చిత్రపరిశ్రమలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ డైలాగ్‌లు చెప్పడం, భావోద్వేగాలను పలికించడం, డ్యాన్సులు చేయడంలో తనకు తానే సాటి. అతను కథానాయకుడుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కోసం ఎన్టీఆర్‌ జిమ్‌లో చాలా కసరత్తులు చేస్తున్నారు. తాజాగా ఆయన ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. జిమ్‌లో షర్ట్‌లెస్‌గా వర్కువుట్‌లు చేస్తున్న ఫోటో అది. ఈ ఫోటోపై అభిమానులు సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా అది ఫేక్ అని తారక్‌ పర్సనల్‌ ట్రైనర్‌ ల్లాయిడ్‌ స్టీవెన్స్‌ చెప్పారు. "అది ఫేక్‌ ఫోటో.. ఎవరు తయారుచేశారో గానీ వారికి హ్యాట్సాఫ్‌’ అంటూ ల్లాయిడ్‌ ట్వీట్‌ చేశారు. కొన్నిరోజుల క్రితం తారక్‌ వర్కవుట్లతో కష్టపడుతున్న ఫోటో ఒకదానిని ల్లాయిడ్‌ పోస్ట్‌ చేశారు. కాగా ఎన్టీఆర్‌ త్రివిక్రమ్ సినిమా తర్వాత, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న మల్టీస్టారర్‌లో నటించనున్నారు. ఇందులో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ సోదరుల్లా కనిపిస్తారని తెలుస్తోంది.