నల్లని దుస్తులతో అసెంబ్లీకి ఎమ్మెల్యే

SMTV Desk 2018-03-22 16:37:25  TDP MLA Gadde Ramamohan, , ramamohan attended assembly with black dress.

అమరావతి, మార్చి 22 : ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కేంద్ర ప్రభుత్వంపై రోజు పలు విధాలుగా నిరసనలు తెలుపుతున్నారు. కాని మునుపెన్నడూ చూడని విధంగా ఓ ఏపీ ఎమ్మెల్యే వెరైటీగా నిరసన తెలిపారు. తేదేపా విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గురువారం నల్లచోక్కా ధరించి అసెంబ్లీ సమావేశానికి హాజరయ్యారు. ఏపీ ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఈ విధంగా విభిన్న రీతిలో నల్లని రంగు వస్త్రాలను ధరించి నిరసన తెలిపారు. అధికార పక్ష నాయకుడు ఇలా నల్ల చొక్కా ధరించి అసెంబ్లీకి రావడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది.