ఇంద్రాణి పై దాడి

SMTV Desk 2017-06-29 18:28:49  indrani mukharji, jail, attack

ముంబయి, జూన్ 29 : ఇటివల సంఘటనలలో కన్న కూతుర్ని చంపిన కేసులో నిందితురాలైన ఇంద్రాణి ముఖర్జియాపై దాడి జరిగినమాట నిజమేనని వైద్యులు తేల్చిచెప్పారు. ఆమె శరీరంపై ఉన్న గాయాలు చెక్కలాంటి పరికరంతో కొట్టారని వైద్యులు చెప్పారు. తన కూతురి హత్య కేసులో ముంబయిలోని బైకుల్లా జైల్లో శిక్ష అనుభవిస్తుంది ఇంద్రాణి.... అలాగే ఈ మధ్య కాలంలో జరిగిన తన తోటి ఖైధీ అయిన మంజు మరణం తో జైలులో కల కలం రేగింది. ఈ కేసు కోసం ఇంద్రనితో సహా మిగిలిన ఖైదీలు అందరూ నిరసన వ్యక్తపరిచారు. ఇక్కడి అధికారులు తమతో చాలా అసభ్యంగా,అలాగే వారిని కొట్టారని ఇంద్రాణి విన్నపించింది.ఈ ఘటన పై తగిన చర్యలు చేపట్టి ఆమెను వైద్యుల సంరక్షణలో ఉంచారు. బుధవారం రోజున ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అదే సమయంలో తోటి ఖైదీ అయిన మంజు మృతి వివరాలు అంటే మంజును ఈడ్చుకు వెళ్ళడం తాను చూశానని ఇంద్రాణి కోర్టులో చెప్పింది.