మంత్రి కేటీఆర్ కు ప్రవాసుల అభినందనలు..

SMTV Desk 2018-03-21 18:49:34  Pravasi Divas, IT Minister Kalvakuntla Ramarao, Irrigation Minister Harishrao.

హైదరాబాద్, మార్చి 21 : తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామరావు కు విదేశాలలో ఉండే ప్రవాసులు అభినందనలు తెలిపారు. తెలంగాణ బడ్జెట్ లో ప్రవాసుల సంక్షేమానికి రూ.100 కోట్లను కేటాయించడం పై గల్ఫ్ ఇతర దేశాల్లోని ప్రవాస తెలంగాణా సంఘాల ప్రతినిధులు అసెంబ్లీలో కేటీఆర్ ను కలిసి అభినందనలు తెలిపారు. రాచకొండ ఎత్తిపోతల పథకం సర్వే పనులకు రూ.1.72 కోట్ల నిధుల కేటాయింపులపై ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ తదితర ప్రతినిధులు అసెంబ్లీ ప్రాంగణంలో మంత్రులు హరీష్ రావు, జగదీశ్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.