పాట పడుతూ అడ్డంగా బుక్కయింది

SMTV Desk 2017-06-29 17:26:09  vekhil, song, polics,

న్యూ ఢిల్లీ, జూన్ 29 : ఇప్పుడు అందరికి సెల్ఫీల పిచ్చి అదేవిధంగా పబ్లిసిటీ పిచ్చి ఎక్కువైపోయింది. వీటి వలన ఎంత లాభమో అంతే నష్టం కూడా ఉంది. ప్రతీ ఒక్కరు ఎదో ఒక వీడియో తియ్యడం లేదా విచిత్రమైన ఫోటోలను తియ్యడం వాటిని పబ్లిసిటీ కోసం యూట్యూబ్ పెట్టి వారి పరువు వారే తీసుకుంటున్నారు. అలాంటి ఒక కథే ఢిల్లీకి చెందిన దించక్ పూజ...ఈమె నాలుగైదు వీడియోల తోనే పాపులారిటి, ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంది. దించక్ పూజ అంటే ఎవరో ఒకప్పుడు ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు ఆమె పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. "సెల్ఫీమైనే లెలీ ఆజ్" అంటూ ఒక పాట పాడి ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది. దీనితో ఆమె లక్షలమంది అభిమానులను సంపాదించుకుంది. ఇదే ప్రయత్నంలో ఇటివల అప్ లోడ్ చేసిన ఒక వీడియో ఆమెను చిక్కులలోకి నెట్టేసింది. స్కూటర్ పై వెళ్తూ... "దిలోంక షూటర్ హై మేరే స్కూటర్... దిలోంక షూటర్ " అంటూ వీడియో పాట పాడింది. ఈ పాటే ఆమెను చిక్కుల్లోకి నెట్టేసింది. ఈ వీడియో లో దించక్ రెడ్ స్కూటర్ పై.. రెడ్ డ్రెస్ వేసుకుని అటూ ఇటు తిరుగుతూ పాట పడిందంట అంతేకాకుండా డ్రైవింగ్ చేస్తూ వాడాల్సిన హెల్మెట ను ఆమె ధరించాలేదంట దానితో ఆ పాయింట్ ను పట్టుకున్న ఓ నెటిజన్ ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. అలాగే ఫిర్యాదులో రోడ్లపై పెద్దగా అరవడం, హెల్మెట్ ధరించకపోవడం ఇవి అన్ని న్యూసెన్స్ కిందకి వస్తాయని చెప్పి తగిన చర్యలు తీసుకోవాలని కోరాడు. వెంటనే అక్కడి పోలీసులు ఆమెపై తగిన చర్యలు తీసుకుoటామని బదులిచ్చారు. ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ యూ ట్యూబ్ స్టార్ పై ఎటువంటి తిసుంకుంటారా అని... ఇది ఇలా జరుగుతూ ఉంటే కొంతమంది నెటిజన్లు ఈమెపై నిప్పులుచేరిగారు. ఈమె చేసే పాటలు ఏంటో ఎమీ అర్దంకావు అని, ఒకే ఒక్క సింగిల్ లైన్ పాటను తిప్పితిప్పి పాడి ఆ బిట్లతో యూ ట్యూబ్ లో సోమ్ముచేసుకుంటుందని కామెంట్స్ తో దుమ్మెత్తిపోసారు. అలాగే డిస్ లైక్ ల మోతమోగించారు. ఎంత యూ ట్యూబ్ స్టార్ అయిన నిబంధనలు పాటించకుండా తన ఇష్టరీత్యా ప్రవర్తిస్తుందా అంటూ తిట్ల వర్షం కురిపించారు. స్టార్ అవ్వడం తప్పు కాదు దానికోసం తిక్క తిక్క వేషాలు వెయ్యడం తప్పు అని అక్కడి నెటిజన్లు విమర్శించారు. ఇలా సోషల్ మీడియా ద్వారా సొమ్ము చేసుకునే వాళ్ళను ప్రోత్సహించాకోడదు అని అంటూ నెటిజన్లు వాపోయారు.