ఫైబర్ గ్రిడ్ పై నోకియా సంస్థ కన్ను!

SMTV Desk 2017-05-29 11:51:33  sisco,fiber grid,america,ktr

న్యూయార్క్, మే 28 : తెలంగాణలో మిషన్ భగీరథ పథకం పైపులైన్లతో పాటు అమర్చుతున్న ఫైబర్ గ్రిడ్ పై ప్రముఖ టెలికాం దిగ్గజ సంస్థ నోకియా కన్ను పడింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ ఫైబర్ గ్రిడ్ పథకం పై ఆసక్తి ఉన్నట్లు పురపరిపాలన మరియు ఐటి శాఖ మంత్రి కేటిఆర్ బృందానికి వెల్లడించింది. ఫైబర్ గ్రిడ్ వితరణకు నిర్వహించే ఆర్ఎఫ్ ఫిలో పాల్గోంటామని ఆ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. మంత్రి కేటిఆర్ అమెరికా పర్యటనలో భాగంగా శాన్ ప్రాన్సిస్కోలో పలు ఐటి సంస్థలతో సమావేశమయ్యారు. ఇందులో భాగంగా నెట్ వర్కింగ్ రంగ దిగ్గజ కంపెనీలు నోకియా, ఎరిక్ సన్ల ప్రతినిధులకు తెలంగాణా ఫైబర్ గ్రిడ్ గురించి వివరించడంతో ఆయా సంస్థలు ఆసక్తిని ప్రదర్శించాయి. అదే విధంగా డాటా అనలిటిక్స్ పార్కులోనూ పెట్టుబడులు పెట్టాలని, మెుబైల్ పరికరాల తయారీ ప్లాంట్ లేదా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి, వారికి నివేదించారు.