జీఎస్టీ కోసం రిలయన్స్

SMTV Desk 2017-06-29 17:02:03  reliance, jio, gst, bil

చెన్నై, జూన్ 29 : ఇటివల కాలంలో రిలయన్స్ జియోతో చేతులు కలిపింది రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (రాయ్)సంస్థ.. జియో వ్యాపారులు అతి సులభంగా జీఎస్టి చెల్లించేందుకుగాను ఒక సొల్యూషన్ ను అమలు చేసింది. అదే జీఎస్టి తో జతకట్టడం జియో- జీఎస్టి లు చెల్లింపుల కోసం సాంకేతికం సాయం అందించే జీఎస్టి సువిధ ప్రొవైడర్స్ (జీఎస్ పీ) లో ఒకటిగా ఉంది. ఇప్పుడు జియో-జీఎస్టి లు వ్యాపారుల రికార్డులు నిర్వహించేందుకు, జీఎస్టి రిటర్నులు ఫైల్ చేసేందుకు, జీఎస్టి చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా నడుచుకునేందుకు సేవలు అందించడానికి సిద్ధంగా ఉంది. రాయ్ సీఈవో కుమార్ ఇలా మాట్లాడుతూ..."జీఎస్టి దేశ వ్యాప్తంగా పన్నులన్నింటిని ఒకే చట్రం కింద తేల్చేందుకు ఇది ఒక ముందడుగు. దీనిని అమలు చేయడం అంత సులభం కాదు కానీ పారిశ్రామిక రంగంలో దీనిని విజయవంతం చేయడానికి మావంతు మేము కృషి చేస్తాం. ప్రస్తుతం వచ్చిన మార్పుల వలన ముందుకెల్లడానికి సాంకేతిక సాయం అవసరమని మేము అనుకుంటున్నాం. ఈ జియో-జీఎస్టి సేవలను ఎలాంటి అవాంతరాలు లేకుండా అందించగలదని మేము నమ్ముతున్నాం అంటూ సందేశమిచ్చారు." సంవత్సరం పాటు సాఫ్ట్ వేర్ సొల్యూషన్, అపరిమిత వాయిస్ కాల్స్, ఏడాది పాటు 24 జీబీ డేటా, వైఫై డివైజ్, బిల్లింగ్ యాప్ తదితర ఫీచర్లు వంటి జియో-జీఎస్టి సేవలను కేవలం రూ.1,999లు చెల్లించి పొందవచ్చు. ఇవి మొబైల్ ద్వారా చిరువ్యాపారులు కూడా సులభంగా నిర్వహించగలరు.