"కళ్యాణలక్ష్మీ" ఆర్థికసాయం పెంపు..

SMTV Desk 2018-03-19 12:43:08  kalyana lakshmi, ts cm, kcr, shadi mubharak, amount increase.

హైదరాబాద్, మార్చి 19 : తెలంగాణ ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ ల ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి పెంచారు. అంతకుముందు రూ.75,000 ఉండగా రూ.1,00,116 ల వరకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ముఖ్యంగా ఆడపిల్లల పెళ్ళిలకు పేదరికం అడ్డోస్తుందని, వారికి అండగా నిలవాలనే ఈ కళ్యాణలక్ష్మీ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. పేదరిక౦ అనేది మనుషుల్ని ఎంతో వేధిస్తోందని, పెళ్లిలకు అయ్యే ఖర్చులను ముందుగానే ఊహించి భ్రూణ హత్యలకు పాల్పడుతున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు. ఈ సమస్యలన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్థిక సాయాన్ని పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.