నాడు లేనిది నేడు విమర్శలేలా.? : చంద్రబాబు

SMTV Desk 2018-03-19 12:30:41  chandrababu naidu, ap cm, teleconference, tdp mps.

అమరావతి, మార్చి 19 : తెదేపా అవిశ్వాస తీర్మానంపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ పార్టీ ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. బీజేపీతో వైపాకా కుమ్మక్కైందని ప్రజలకు స్పష్టంగా తెలుస్తోందన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. "అవిశ్వాస తీర్మానంపై చర్చ నిర్వహించకుండా సభను వాయిదా వేస్తే ఎంపీల౦తా యథావిధిగా ఆందోళన కొనసాగించాలి. మనం అడిగేది కేవలం రాష్ట్రానికి న్యాయం చేయమని మాత్రమే. కాని న్యాయం అడిగినందుకు భాజాపా మాపై యుద్ధం ప్రకటిస్తుంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీలో చెప్పింది. అలాంటప్పుడు కేంద్రానికి ఉన్న అభ్యంతరం ఏమిటి?" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా "వైసీపీ అధినేత జగన్‌ ఆనాడు కాంగ్రెస్‌తో, నేడు భాజపాతో లాలూచీ పడ్డాడు. కేవలం వీరి కేసుల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడం ఎంతవరకు సమంజసం.? ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ ఎందుకు యూటర్న్ తీసుకోవలసి వచ్చిందో అర్థమవుతోంది. నాలుగేళ్ళుగా విమర్శించని వ్యక్తి ఇప్పుడెందుకు ఎదురు తిరిగారు. ఎందుకు విమర్శిస్తున్నాడు. ఏపీ ప్రజల హక్కులపై రాజీపడే ప్రసక్తే లేదు. విభజన హామీలను నేరవేర్చాల్సిందే. పొరుగు రాష్ట్రాలతో సమాన స్థాయికి ఎదిగే౦త వరకు కేంద్రం చేయుతనివ్వాలి" అంటూ చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.