కోచ్ గా మారనున్న జ్వాల

SMTV Desk 2017-06-29 15:36:08  india, badminton, player, jwala gutta

హైదరాబాద్, జూన్ 29 : భారత అగ్రశ్రేణిగా నిలిచిన డబుల్స్ క్రీడాకారిణి గుత్త జ్వాల కెరీర్ ఇక ముగిసినట్లే! కోచ్ గా కూడా ఆమె రెండో ఇన్నింగ్స్ మొదలైనట్లే! ఈ విషయం జ్వాల అధికారంగా ప్రకటించకపోయినా ఇది అందరికి తెలిసిందే. భారత బ్యాట్మింటన్ సంఘం (బాయ్) ఆమెను డబుల్స్ కు కోచ్ గా నియమించారు. సింగిల్స్, డబుల్స్ లకు వేరు వేరుగా కోచ్ లను నియమించిన బాయ్, ప్రత్యేకంగా మహిళల డబుల్స్ కోసం 33 సంవత్సరాల జ్వాలను ఎంపిక చేశారు. ఆరేళ్ళ వయసులోనే బ్యాట్మింటన్ రాకెట్ చేతపట్టిన జ్వాల, డబుల్స్ క్రీడాకారిణిగా ఎన్నో ఘనతల్ని సాధించుకుంది. 2011 ప్రపంచ ఛాంపియన్ షిప్ లో డబుల్స్ లో కాంస్యం, 2009 ప్రపంచ సూపర్ సిరీస్ ఫైనల్స్ లో మిక్స్డ్డ డబుల్స్ లో రజతం, అలాగే 2014 ఆసియా క్రీడల్లో మహిళల డబుల్స్ లో కాంస్య పతకాలను సాధించింది. అదేవిధంగా 2010 కామన్వెల్త్ క్రీడల్లో మహిళల డబుల్స్ లో స్వర్ణం, 2014 లో రజతం, 2010 లో మిక్స్డ్ టీమ్ లో రజతం, ఇంకా 2006 లో కాంస్యం సాధించుకుంది. బిట్ బర్గర్ ఓపెన్, బల్గేరియా ఓపెన్, చైనీస్ తైపీ ఓపెన్, ఇండియా ఓపెన్, కెనడా ఓపెన్ లలో డబుల్స్ విభాగాలలో జ్వాల ఉత్తీర్ణత సాధించింది. 2012 లండన్ ఒలింపిక్స్, అలాగే 2016 లో జరిగిన ఒలింపిక్స్ లో కూడా జ్వాల తన సామర్ద్యాన్ని, బలాన్ని మరోసారి అందరికి చాటిచెప్పింది. మరోవైపు జాతీయ చీఫ్ కోచ్ గా పుల్లెల గోపీచంద్ ను కొనసాగిస్తూనే పెద్ద సంఖ్యలో కోచ్ లను నియమించింది బాయ్, పురుషుల సింగిల్స్ లో 21 మంది, అలాగే పురుషుల డబుల్స్ లో 12 మంది, మహిళల డబుల్స్ లో నలుగురిని ఎంపిక చేశారు. జూనియర్స్ లో బాలురకు అలాగే బాలికలకు వరుసగా 21, 10 మందిని కోచ్ లగా నియమించారు. సీనియర్, జూనియర్ విభాగాలకు ఎంపిక చేసిన నలుగురు సభ్యుల సలహాదారుల బృందంలో ద్రోణాచార్య ఆరిఫ్ కు కూడా చోటు దక్కింది. సీనియర్ విభాగాలకు సైనా నెహ్వాల్ కోచ్ విమల్ కుమార్, చేతన్ ఆనంద్, అనిల్ కుమార్ లను కోచ్ లుగా నియమించారు. అదేవిధంగా పురుషుల డబుల్స్ లోమనోజ్ కుమార్. మహిళల డబుల్స్ లో జ్వాల, మధుమిత బిస్త్, ప్రద్న్య గాద్రె, ఓలి డేకాలను ఎంపిక చేశారు. జూనియర్ విభాగంలో చీఫ్ కోచ్ గా సంజయ్ మిశ్రాతో పాటు 20 మందిని ఎంపిక చేశారు. జూనియర్ కోచ్ ల బృందంలో గోవర్ధన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, విద్యాధర్, దీప్తి, శారద రెడ్డిలకు చోటు దక్కింది.