శ్రీవిళంబినామ సంవ‌త్స‌ర‌ శుభాకాంక్షలు : వెంకయ్య

SMTV Desk 2018-03-18 11:39:24  ugadi festival, vice prsident, venkaiah naidu, gavarnor, cm kcr.

హైదరాబాద్, మార్చి 18 : తెలుగు రాష్ట్ర ప్రజలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉగాది పండగ(శ్రీవిళంబినామ సంవ‌త్స‌ర‌) శుభాకాంక్షలు తెలిపారు. రాజ్‌భవన్‌లో ఘనంగా ప్రారంభమైన ఈ వేడుకలకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. గవర్నర్ దంపతులు ఉగాది వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. మన జీవితంలో పండగలు అన్ని ప్రకృతితోనే ముడిపడి ఉన్నాయన్నారు. అలాంటి ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం కొని తెచ్చుకున్నట్లే. నేటి తరానికి ఈ తెలుగు నెలలు.. ఈ సంవత్సరాలు తెలియట్లేదు. మనం జరుపుకునే ప్రతి పండగ వెనుక ఒక శాస్త్రీయ సందేశం ఉంటుంది. ఈ ఉగాది పచ్చడిలానే అందరి జీవితాల్లో షడ్రుచులు ఉంటాయని.. పెద్దలు మన భాషా, సంస్కృతి గురించి పిల్లలకు చెప్పాలని పిలుపునిచ్చారు.