మూడు పార్టీల కుట్రను బయటపెట్టాం : చంద్రబాబు

SMTV Desk 2018-03-17 12:58:23  chandrababu naidu, ap cm, teleconference, tdp mps.

అమరావతి, మార్చి 17 : మూడు పార్టీల మహా కుట్రను(బీజేపీ, వైసీపీ, జనసేన) ప్రజల ముందు బయటపెట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. అవిశ్వాసానికి అందరి మద్దతు కూడగట్టాలని.. దీంతో ఎంపీలంతా రెండు రోజులు ఢిల్లీలోనే ఉండాలని ఆదేశించారు. ఈ మేరకు అన్ని పార్టీల నేతలను వ్యక్తిగతంగా కలవాలని సూచించారు. సరైన సమయంలో ఎన్డీయే ప్రభుత్వం నుండి బయటకు వచ్చి.. అవిశ్వాస తీర్మాన౦ పెట్టడంపై నిర్ణయం తీసుకున్నామన్నారు. అవిశ్వాస తీర్మానం ఇచ్చిన వెంటనే తమకు అనేక పార్టీలు మద్దతిచ్చాయని టెలీకాన్ఫరెన్స్ ద్వారా ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.