ఒకుహరపై విజయం సాధించిన తెలుగు తేజం..

SMTV Desk 2018-03-17 12:51:56  All England Open, p.v. sindhu, Okuhara, japan

బర్మింగ్‌హామ్‌, మార్చి 17 : అల్ ఇంగ్లాండ్ టోర్నమెంట్ లో తెలుగు తేజం పీ.వీ. సింధు ఆదరగొట్టింది. జపాన్ క్రీడాకారిణ, ప్రపంచ చాంపియన్‌ ఒకుహారా ను ఓడించి సెమీస్ కి అర్హత సాధించింది. 84 నిమిషాలపాటు ఉత్కంఠభరితంగా సాగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్‌ సింధు 20–22, 21–18, 21–18తో ప్రపంచ ఆరో ర్యాంకర్, ప్రస్తుత వరల్డ్‌ చాంపియన్‌ ఒకుహారాను ఇంటిదారి పట్టించింది. నేడు జరిగే సెమీఫైనల్లో అకానె యామగుచి (జపాన్‌)తో సింధు తలపడనుంది. మరో వైపు పురుషుల సింగిల్స్‌లో ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్‌ శ్రీకాంత్‌, అన్‌సీడెడ్‌ హువాంగ్‌ యుజియాంగ్‌ (చైనా) చేతిలో ఓటమి పాలయ్యాడు.