అవినీతి ఆరోపణలను నిరూపించగలరా.? : చంద్రబాబు

SMTV Desk 2018-03-16 18:52:49  chandrababu, apcm, janasena, pawan kalyan.

అమరావతి, మార్చి 16 : జనసేన ఆవిర్భావ సభలో పవన్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాపై అవినీతి ఆరోపణలు చేసిన వారు వాటిని నిరూపించగలరా.? నిజంగా డబ్బే కావాలి అనుకుంటే లోకేష్ హెరిటేజ్ ను చూసుకునే వాడు కదా.! ప్రజా సేవ చేయాలని కాంక్షతో రాజకీయాల్లోకి వచ్చారని చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే జనసేన అధినేత పవన్‌ ఏర్పాటుచేసిన జేఎఫ్‌సీపై మండిపడ్డారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధుల లెక్కలను పరిశీలించడానికి ఈ మధ్యవర్తులెవరు.? ఎన్డీయేలో ఉన్నంత వరకు ఇతర పార్టీలతో మాట్లాడేందుకు తమకు ఇబ్బందులు ఉండేవని.. ఇప్పుడు ఎలాంటి మొహమాటాలూ లేకుండా అన్ని జాతీయ పార్టీలను కలుపుకొని వెళ్తానని స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ లపై పవన్ కళ్యాణ్ అవినీతి ఆరోపణలు చేసిన విషయం విదితమే.