అద్భుతం ఆవిష్కృతమైన రోజు..

SMTV Desk 2018-03-16 15:59:30   Sachin Tendulkar, 100th international century, indian cricket player, india

న్యూఢిల్లీ, మార్చి 16 : ప్రపంచ క్రికెట్ చరిత్రలో సచిన్ టెండూల్కర్ అంటే తెలియని వారూ౦డరు.. టీమిండియా క్రికెట్ లో ఒక ప్రత్యేకమైన స్థానం ఆక్రమించిన మాస్టర్ బ్లాస్టర్ ఎన్నో రికార్డు లను తన ఖాతాలో వేసుకున్నాడు. అతని బ్యాటు నుండి జారువాలిన ఎన్నో శతకాలు, ఇప్పటికి చెక్కు చెదరకుండా ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో వన్డేలో 49 సెంచరీలు, టెస్టులో 51 సెంచరీలు సాధించి ప్రపంచ క్రికెట్ పై తనదైన ముద్ర వేసిన ఘనత సచిన్ సొంతం. కాగా సరిగ్గా ఆరేళ్ల క్రితం ఇదే రోజు అంతర్జాతీయ క్రికెట్‌లో టెండూల్కర్ ఓ అసాధారణ రికార్డు ను సాధించాడు. అదేంటంటే.. లిటిల్ మాస్టర్ అంతర్జాతీయ క్రికెట్ లో నూరు శతకాల రికార్డును చేధించాడు. ఎన్నో రోజుల నుండి ఊరిస్తున్న వంద సెంచరీల ఘనతను క్రికెట్ గాడ్ ఈ రోజు అందుకున్నాడు. అన్నీ ఫార్మట్లలో కలిపి అప్పటికే 99 సెంచరీలు సాధించిన సచిన్‌ 100వ సెంచరీకి చాలా సమయం పట్టింది. దీంతో అభిమానులు ఆయన వందో సెంచరీ కోసం చాలా ఎదురు చూశారు. ఆసియా కప్‌లో భాగంగా 2012 మార్చి16 న ఢాకాలోని షేర్‌ బంగ్లా స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సచిన్‌ ఈ ఫీట్‌ను సాధించాడు. బంగ్లాదేశ్‌పై సచిన్‌కు ఇదే తొలి వన్డే సెంచరీ కావడం విశేషం. దురదృష్టం ఏంటంటే.. ఈ మ్యాచ్‌లో భారత్‌ 5 వికెట్ల తేడాతో ఓటమి పాలయ్యింది.