వారికి చెడ్డపేరు మాత్రం తీసుకురాను : లోకేష్

SMTV Desk 2018-03-15 18:41:10  ap it minister, lokesh, assembly, ap cm, chandrababu.

అమరావతి, మార్చి 15 : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి 40ఏళ్ల రాజకీయ జీవితంపై మంత్రి లోకేష్ శాసనసభలో మాట్లాడారు. నాలాంటి యువకుడికి రోల్‌మోడల్‌ అయిన చంద్రబాబు నాయుడు.. 64ఏళ్ల వయసులో నూ 24ఏళ్ల వ్యక్తిలా పరిగెడతారు. అనేకసార్లు అర్ధరాత్రి 12గంటలు అనే తేడా లేకుండా సమీక్ష సమావేశం అంటూ ఉండిపోతారు. ఇదంతా ఎవరి కోసం చేస్తున్నారు? మన కోసం.. మన పిల్లల భవిష్యత్‌ కోసం. ఫ్యాక్షన్‌ గ్రామాల్లోని పిల్లలు పక్కదారి పట్టకుండా వారు చదువుకోవాలనే ఉద్దేశంతో మోడల్‌ స్కూల్‌ ప్రారంభించారు. ముఖ్యంగా ఆయన ఈ స్థాయికి వచ్చారంటే అందులో మా అమ్మగారి కృషి ఎంతగానో ఉంది. ఆమె కష్టం వల్లే మా నాన్నగారు ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారని నేను భావిస్తున్నా. నిజం చెప్పాలంటే నాకు మా తాత ఎన్టీఆర్‌, తండ్రి చంద్రబాబునాయుడికి ఉన్న౦త పేరు వస్తుందో.? రాదో.? తెలీదు కాని వారికి మాత్రం ఏనాడూ చెడ్డపేరు తీసుకురానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా.. అంటూ వెల్లడించారు. జనసేన ఆవిర్భావ సభలో పవన్‌ కళ్యాణ్.. మంత్రి లోకేష్‌పై తీవ్రస్థాయి విమర్శలు చేసిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.