నాడు పోరాటం చేసినవారు నేడు విలన్లు.? : ఉత్తమ్

SMTV Desk 2018-03-15 17:06:28  PCC PRESIDENT, UTTAMKUMAR REDDY, ASSEMBLY MEETING, CONGRESS.

హైదరాబాద్, మార్చి 15 : అసెంబ్లీలో ప్రతిపక్ష౦ లేకుండా సస్పెండ్ చేసి తాపీగా సభలను నడుపుకుంటున్నారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తాము ఎక్కడ ప్రజా సమస్యల గురించి సభలో చర్చిస్తామోనని భయపడి ప్రతిపక్షాన్ని సభలో లేకుండా సస్పెండ్ చేశారని హేళన చేశారు. ప్రజా సంఘాలు, విద్యార్ధి సంఘాల పోరాట ఫలిత౦గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఆనాడు రాష్ట్రం కోసం పోరాడిన వారంతా నేడు విలన్లు గా మారారా.? అంటూ ప్రశ్నించారు.