పవన్ పై వ్యక్తిగత విమర్శలు వద్దు : చంద్రబాబు

SMTV Desk 2018-03-15 14:47:26  chandrababu anidu, pawan kalyan, teleconference, tdp mps

అమరావతి, మార్చి 15 : పవన్ కళ్యాణ్ పై ఎవరు వ్యక్తిగతంగా విమర్శలు చేయొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ సభ్యులకు హిత బోధ చేశారు. టీడీపీ ఎంపీలు, అసెంబ్లీ వ్యూహ కమిటీ సభ్యులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు...ఈ సందర్భంగా మాట్లాడారు. "నన్ను ఎవరు తిట్టినా అవి నాకు ఆశీర్వచనాలే. మన విమర్శలు హుందాగానే ఉండాలి. ఎవరు ఆవేశాలకు గురికాకుండా ఉండండి. ఇది అత్యంత కీలక సమయం. మన లక్ష్యం కేవలం రాష్ట్ర ప్రయోజనాలవైపే ఉండాలి" అంటూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.