చైనా సరిహద్దుల్లో దిగిన రక్షణ విమానం

SMTV Desk 2018-03-15 13:12:39  defence, flight, land, china, border

న్యూఢిల్లీ, మర్చి 15: భారత వైమానిక రంగానికి చెందిన రక్షణ విమానం‌ సీ-17 చైనాకు సమీపంలోని భారత్‌ సరిహద్దుల్లో దిగింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని పర్వత ప్రాంతలో చైనా సరిహద్దులకు సమీపంలో రక్షణ రంగానికి చెందిన విమానం దిగడం ఇదే తొలిసారి. దీనిపై రక్షణా శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ట్విటర్ ద్వారా అధికారులకు అభినందనలు తెలిపారు. ‘భారత వైమానిక దళం సీ-17 అనే రక్షణ రవాణా విమానాన్ని అరుణాచల్ ప్రదేశ్‌లోని ట్యూటింగ్‌ అడ్వాన్స్‌డ్‌ ల్యాండింగ్‌ గ్రౌండ్‌(ఏఎల్‌జీ)లో దించడం రక్షణ విభాగానికి సంబంధించి చారిత్రాత్మక ఘట్టమని నిర్మలా సీతారామన్‌ అన్నారు. పర్వత ప్రాంతం కావడంతో అక్కడ ల్యాండింగ్ ఎంతో కష్టతరమైంది’ అని ఆయన పేర్కొన్నారు.