గుండెపోటుతో ప్రముఖ నటుడు మృతి..

SMTV Desk 2018-03-14 14:28:30  Bollywood actor, Narendra Jha dead, Bollywood.

హైదరాబాద్, మార్చి 14 : బాలీవుడ్ లో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకొని ప్రతినాయక పాత్రలతో ఎన్నో సూపర్ హిట్ విజయాలను అందుకున్న నటుడు నరేంద్ర ఝా(55) తుదిశ్వాస విడిచారు. నేటి ఉదయం తీవ్ర గుండెపోటుకు గురైన ఆయనను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. నరేంద్ర మొదట మోడలింగ్ లో తన కెరీర్ ను మొదలుపెట్టి టాలీవుడ్ లో యమదొంగ, ఛత్రపతి.. బాలీవుడ్ లో రాయిస్, హైదర్, మొహంజోదారో వంటి సినిమాలో నటించారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.