సరికొత్త లుక్ లో జూనియర్ ఎన్టీఆర్

SMTV Desk 2018-03-14 12:36:35  Jr NTR, Jr NTR New look, Jr NTR, Thivikram Srinivas Movie.

హైదరాబాద్, మార్చి : జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ లో దర్శనమిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎన్టీఆర్ లుక్ ను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. జైలవ కుశ సినిమాలో కొంచెం బొద్దుగా కనిపించిన ఎన్టీఆర్ ఇప్పుడు ఎంతో ఫిట్ గా కనిపిస్తున్నారు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్, రణ్‌వీర్‌ సింగ్‌ లకు జిమ్ ట్రైనింగ్ ఇచ్చిన ట్రైనర్ స్టీవెన్స్‌ ఎన్టీఆర్ కు జిమ్ ట్రైనింగ్ ఇస్తున్నారు. త్రివిక్రమ్-జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కోసం ఎన్టీఆర్ ఈ కసరత్తులు చేస్తున్నారని తెలుస్తుంది. ఏప్రిల్ లో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాలో పూజా హెగ్డే ఎన్టీఆర్ తో రొమాన్స్ చేయనుంది. ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూర్చనున్నారు.