అమెరికా విదేశాంగ మంత్రిని తొలగించిన ట్రంప్..!

SMTV Desk 2018-03-13 19:11:22  america president, donald trump, Foreign Minister Rex Tillerson

వాషింగ్ట‌న్, మార్చి 13 : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలమైన నిర్ణయం తీసుకున్నారు. విదేశాంగ మంత్రి రెక్స్ టిల‌ర్‌స‌న్‌ను తొలగించి ఆయన స్థానంలో సీఐఏ డైరెక్ట‌ర్‌గా ఉన్న మైక్ పాంపియోను నియమించారు. సీఐఏ డైరెక్ట‌ర్‌గా ఓ మ‌హిళ‌ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఇలా సీఐఏ డైరెక్ట‌ర్‌గా మహిళను (గినా హాస్పెల్) నియమించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా విదేశాంగ మంత్రిగా రెక్స్ టిల‌ర్‌స‌న్‌ అందించిన సేవ‌ల‌కు గాను ఆయనకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అలాగే కొత్త‌గా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్న మైక్ పాంపియోపై ప్ర‌శంస‌లు కురిపించారు. ఇదిలా ఉండగా విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ట్రంప్ కు టిల‌ర్‌స‌న్‌తో కొద్ది రోజుల నుండి విభేదాలు తలెత్తడంతో తనను పదవి నుండి తప్పించినట్లు సమాచారం.