ఏ మాత్రం మార్పు లేని అంబానీ జీతం

SMTV Desk 2017-06-28 17:24:42  mukesh, ambhani, reliance, jio

ముంబయి, జూన్ 28 : భారత్ లోనే అత్యంత ధనికుడైన రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేశ్ అంబానీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా తాను తీసుకుంటున్న వార్షిక వేతనంలో తొమ్మిదో ఏడాది కూడా ఎలాంటి మార్పు లేదు. ఈ ఏడాది కూడా ఆయన రూ.15 కోట్లను తన వార్షిక వేతనంగా పొందనున్నారు. అలాగే ఈయన ఇతర బోర్డ్ డైరెక్టర్ లు పొందుతున్న స్టాక్ ఆప్షన్ ను కూడా ఈయన తీసుకోవడం లేదు. ముఖేశ్ అంబానీ 2008-09 నుండి రూ.15కోట్లను వార్షిక వేతనంగా పొందుతున్నారు. అలాగే 2009లో ఆయన తన వార్షిక వేతనంపై అంబానీ స్వచ్చందంగా పరిమితి విధించుకున్నారు. ఆయనకు ఈ పరిమితి గత తొమ్మిది సంవత్సరాలుగా అలాగే కొనసాగుతుంది. ముఖేశ్ అంబానీ తన వార్షిక వేతనంపై పరిమితి విదించుకోవడం వలన ఆయన వార్షిక వేతనం రూ.38.75 కోట్లుగా ప్రతిపాదించినప్పటికీ రూ.15 కోట్లే ప్రకటిస్తున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ తన 2016 -17 వార్షిక నివేదికలో పేర్కొంది.