ట్రంప్ కు ఉపదేశించిన పోప్!!

SMTV Desk 2017-05-29 11:43:54  vatican city,pop,america president,donald tramp

వాటికన్ సీటి, మే 28 : ప్రపంచంలో శాంతిని వెదజల్లి.. సుహృద్భావ వాతావరణంలో జనజీవనం కొనసాగేటట్టుగా అమెరికా అధ్యక్ష పదవిని వినియోగించుకోవాలని పోప్ ప్రాన్సీస్ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు ఉపదేశించారు. అంతర్జాతీయ శాంతికి చిహ్నమైన అలీవ్ చెట్టు రూపంతో కూడిన పతకాన్ని పోప్ ఆయనకు బహూకరించారు. శాంతికి ఉపకరణం లాంటి వారు కాబట్టి బహుకరిస్తున్నట్లు పోప్ వెల్లడించారు. వాటికన్ సిటీలో వారిద్దరు సుమారు అరగంటపాటు భేటి అయ్యారు. పోప్ ప్రాన్సీస్ ఉపదేశాన్ని ఎన్నటికి మరువనని డోనాల్డ్ ట్రంప్ వెల్లడిస్తూ... పోప్ ప్రాన్సీస్ కు ధన్యవాదాలు తెలిపారు. మేం శాంతిని కాపాడుతామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.